మోడి – అమిత్ షా ల పోలిటికల్ కెరీర్ లోనే అతిపెద్ద చావు దెబ్బ ?

-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ స్టోరీ అటూ ఇటూ కాకుండా పోయింది. ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేయడం తర్వాత వెంటనే బీజేపీ కండువా కప్పుకోవడం తో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలో పడింది. దీంతో వరుసగా ఓటమి పాలయిన బీజేపీకి బలం పెరిగిందని రకరకాల వార్తలు జాతీయ మీడియాలో వరుసగా మొన్నటివరకు రావటం జరిగింది.Image result for modi amith shahఇటువంటి తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అని అనుకుంటున్న తరుణంలో సింధియాకు మద్దతునిచ్చిన ఆరుగురు మంత్రులను సీఎం కమల్ నాథ్ విజ్ఞప్తి మేరకు గవర్నర్ లాల్ జీ టాండన్ తొలగించారు. ఇటీవల గవర్నర్ ను కలిసి బలపరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధమేనని సీఎం కమల్ నాథ్ తెలిపారు. మార్చి 16న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. కాబట్టి 16వ తేదీనాడే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందిగా స్పీకర్ ను సీఎం కమల్ నాథ్ కోరారు. కాగా బీజేపీ కూడా ఇదే డిమాండ్ తో ఉన్నట్టు తెలుస్తున్నది.

 

అయితే కచ్చితంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలో లేదని అక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. దీంతో ఇదే గనుక జరిగితే ఎన్నికల్లోనూ మరియు వ్యూహాల్లోనూ మోడి – అమిత్ షా కి అతిపెద్ద చావు దెబ్బ తగిలినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news