ఏపీ నుంచి బీజేపీలో చేరడానికి రెడీ అయిన వారిలో పలువురు ప్రమఖ నేతలు ఉన్నారు. వీరిలో వాకాటి నారాయణరెడ్డి , నక్క బాలయోగి, తోట నగేష్, సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, పూతలపట్టు రవి ఉన్నారు. ఇక తెలంగాణ టిడిపి నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. వీళ్లలో చాలా మంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ద్వారా ఆ పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో వీరంతా బిజెపిలో చేరుతున్నట్టు రామ్‌మాధవ్ స్పష్టం చేశారు.
బీజేపీలో చేరడానికి సిద్ధమైన వారిలో శనక్కాయల అరుణ గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రిటైర్డ్ ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పార్థసారథి కూడా ఉన్నారు. ఇక మాజీ హోం మంత్రి, తెలంగాణకు చెందిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు , తెలంగాణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు వీరెందర్ గౌడ్ సైతం బీజేపీలో చేరుతున్నారు. ఆయన కూడా ఇప్పటికే రామ్ మాధవ్‌ను కలిశారు.
ఐదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రసంశించారు. న్యూ ఇండియా చేయాలన్న మోదీ ఆలోచన తనకు బాగా నచ్చిందని, అందుకే బీజేపీలో చేరుతున్నానని వివరించారు. నయా భారత్ రావాలంటే మోదీతోనే సాద్యమన్నారు. ఇక ఏపీలో టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎంపీలతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలపై కూడా బీజేపీ వల వేసింది. ఇక ప్రస్తుతం టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు సైతం తమ వ్యాపార, రాజకీయ అవసరాల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.