చంద్రబాబు ఆశలు తూట్లు తూట్లు గా పొడిచేశారు పాపం !

117

దేశంలో ఉన్న చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు చంద్రబాబు రాజకీయం పట్ల ఆయన అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట అని మాట మార్చడం లో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో  2014 ఎన్నికల సమయంలో మోడీ హవా దేశమంతా వీస్తున్నతరుణంలో బీజేపీతో చేతులు కలిపి అప్పటి ఎన్నికల సమయంలో పోటీ చేసి చంద్రబాబు గెలవడం జరిగింది.

అయితే రాష్ట్రంలో బీజేపీ పార్టీపై వ్యతిరేకత రావడంతో బిజెపి పార్టీ ని దారుణంగా విమర్శించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే తన పర్మిషన్ ఉండాలని చెప్పి బిజెపి పార్టీ ని దారుణంగా విమర్శించి బిజెపి పార్టీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పోటీ చేసి బిజెపి ని దారుణంగా విమర్శించడం ఆ సందర్భంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోవడంతో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ తో అంటీ అంటనట్టు గా బయటికి కలరింగ్ ఇస్తూ రాజకీయాలు చేసినా చంద్రబాబు..తాజాగా పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలపడంతో త్వరలో తనని కూడా కలుపు కుంటారన్న భావనలో ఉన్న చంద్రబాబుకు ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఆశలు తూట్లు తూట్లు గా పొడి చేసినట్లయింది అని ఏపీ మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్. కచ్చితంగా చంద్రబాబుతో మాత్రం బిజెపి చేతులు కలపడం అనేది ఉండదని పవన్ కళ్యాణ్ తాజాగా బిజెపితో చేతులు కలిపిన సందర్భంలో ఏపీ బీజేపీ నేతలు చేసిన కామెంట్లు బట్టి అర్థమవుతుంది.