అసలే లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రం పైగా గత ముఖ్యమంత్రి చాలా దారుణంగా అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ జగన్. ఇటువంటి పరిస్థితుల మధ్య ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఖర్చులు తగ్గించి అద్భుతమైన పరిపాలన చేస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే తాజాగా ఇటీవల హైకోర్టు 14వ ఆర్థిక సంఘం నుండి రాష్ట్రానికి రావాల్సిన ఐదు వేల కోట్లు…ఏపీ ఖజానాలో పడాలంటే కచ్చితంగా మార్చి చివరికల్లా స్థానిక ఎన్నికలు కంప్లీట్ చేయాలని ఏపీ సర్కార్ కి ఆదేశం ఇవ్వటం జరిగింది.ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం మరియు జనసేన కంటే బిజెపి పార్టీ జగన్ కి అతి పెద్ద తలనొప్పి గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 40కిపైగా ప్రాంతాలలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలను ఆధారం చేసుకొని అదేవిధంగా coronavirus నీ అడ్డుపెట్టుకొని టీడీపీ డైరెక్షన్లో ఎన్నికల కమిషనర్ కేంద్ర పెద్దలతో చర్చించి ఎన్నికలు వాయిదా వేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది తెలిసిన కేంద్ర బిజెపి పెద్దలు తెలిసి తెలిసి ఎన్నికలను దగ్గరుండి వాయిదా వేయటం దారుణమని, బిజెపి పార్టీ జగన్ కి తలనొప్పిగా మారిందని చాలా మంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.