ఏపీలో పొత్తులపై ట్విస్ట్ లు నడుస్తున్నాయి..టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? బిజేపి-జనసేన పొత్తు కొనసాగుతుందా? లేదా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇప్పుడున్న పరిస్తితుల్లో బిజేపి-జనసేన పొత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది..అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. అయితే గత ఎన్నికల తర్వాత బిజేపి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తులో ఉన్నాయి గాని..ఏనాడూ కలిసి పనిచేయలేదు.
కలిసి పోరాటాలు చేయలేదు. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అప్పటికే పలుమార్లు పవన్..బిజేపిని రూట్ మ్యాప్ అడిగారు..అయినా బిజేపి స్పందించలేదు..ఇక కేంద్రంలో బిజేపి పెద్దలు సహకరించిన..రాష్ట్రంలో నేతలు కలిసిరావట్లేదని పవన్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పొత్తు దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు కనిపించింది. ఇదే క్రమంలో బిజేపి ఏమో..టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని అంటూ..వైసీపీకి అనుకూలంగా ముందుకెళుతుంది..అటు జనసేన ఏమో టిడిపితో కలవడానికి రెడీగా ఉంది. ఇలా రెండు పార్టీలు వేరు వేరుగా రాజకీయం నడుపుతూ వస్తున్నాయి.
ఇక తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి మూడుచోట్ల గెలిచింది..బిజేపి పోటీ చేసి చెల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు..కానీ బిజేపికి మద్ధతు ఇవ్వలేదు..పరోక్షంగా టిడిపికి మద్ధతు ఇచ్చినట్లు కనిపించింది. దీంతో బిజేపి రగిలిపోతుంది. ఉత్తరాంధ్రలో పోటీ చేసి ఓడిపోయిన బిజేపి నేత మాధవ్..ఇంకా జనసేనతో పొత్తు లేనట్లే అని చెప్పుకొచ్చారు.
అదే బాటలో సోము వీర్రాజు కూడా కామెంట్ చేశారు. కాకపోతే ఇంకా పొత్తు లేదని ఫిక్స్ చేయలేదు. కానీ దాదాపు పొత్తు ముగిసినట్లే అని చెప్పవచ్చు. ఈ పరిణామాలతో పొత్తు కోసం చూస్తున్న కొందరు బిజేపి నేతలు ఇంకా పార్టీ జంప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి బిజేపి-జనసేన పొత్తు పెటాకులు అయిందనే చెప్పవచ్చు.