ఏపీలో చంద్ర‌బాబు హిట్ల‌ర్‌ను మించిపోయారు : రాంమాధ‌వ్‌

-

Bjp leader ram madhav fires on ap cm Chandrababu Naidu

అమ‌రావ‌తి : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండాలని భార‌తీయ జ‌న‌తా పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో సోమ‌వారం చేపట్టిన ధర్మపోరాట దీక్షలో రాంమాధ‌వ్‌ మాట్లాడారు. బాధితులు ఢిల్లీ వచ్చి మమ్మల్ని కలిశారని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో చెప్పాలని రాంమాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు హిట్ల‌ర్‌ను మించిపోయి పాల‌న సాగిస్తున్నార‌ని ఆరోపించారు.

ఎన్నో ఆశలతో తెలంగాణలో టి ఆర్ ఎస్‌కు, ఏపీలోతెలుగుదేశానికి ప్రజలు అవకాశమిస్తే ఈ రెండు ప్రభుత్వాలూ అవినీతిమయం అయ్యాయని రాంమాధవ్‌ ఆరోపించారు. చీటికీ మాటికీ కేంద్రంపై టిడిపి నేతలు అపనిందలు వేస్తున్నారని, అర్ధరహితమైన డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడమే తమ ఆందోళన ఉద్దేశమని చెప్పారు. ఏపీ బిజేపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ…మంగ‌ళ‌గిరి వ‌ద్ద‌నున్న హాయ్‌లాండ్‌ను చౌకగా కొట్టేయాలని.. ఎంపీ మురళీ మోహన్, నారా లోకేష్‌ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే వాళ్ల ధరకు యాజమాన్యం అంగీకరించకపోవడంతోనే కుట్రలు మొదలుపెట్టారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నా.. కుట్ర జరిగింది మాత్రం ఏపీలోనే అని పేర్కొన్నారు.

బిజేపీ న్యాయం చేస్తామ‌న‌డం విడ్దూరం- ఎంపీ కేశినేని

అగ్రిగోల్డ్‌ బాధితులకు బిజేపీ నాయాకులు న్యాయం చేస్తారనడం విడ్డూరంగా ఉందని విజ‌య‌వాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అన్నారు. విభజన హామీల విషయంలో ఆంధ్రులకు ఏం న్యాయం చేశారో, 18 విభజన హామీలను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అల్లాడుతుంటే కనీసం బిజేపీ నేతలు ఆ వైపు కూడా చూడలేదని విమర్శించారు. తుపాను సాయంపై ప్రభుత్వం లేఖలు రాస్తే కనీసం స్పందన లేదని మండిపడ్డారు. ఇప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితులపై మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొనుగోలు చేయకుండా అమిత్‌షా అడ్డుపడ్డారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news