రేవంత్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ న‌యా ప్లాన్‌..

తెలంగాణ పాలిటిక్స్‌లో త్రికోణ‌పు పోటీ క‌న‌బడుతోంది. కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు రాష్ట్రంలో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా న‌డిచేది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చాకా ఇప్పుడు కాంగ్రెస్ లో నూత‌న ఉత్సాహం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ను మళ్లీ బలోపేతం చేసేందుకు ఆయ‌న వ్యూహాలను ప‌న్నుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసే టీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం న‌ని వారు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ తమతో పోటీ పడలేదని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వైపు వెళ్తున్న నాయకుల‌ను నాయ‌కుల‌ను తమ వైపు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు వ‌చ్చిన పలువురు నాయ‌కుల‌ను రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు తీసుకున్న తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

బీజేపీకి ఇదో కొత్త సవాల్ అనుకోవ‌చ్చు. అయితే వారి ఆ పార్టీ నాయ‌కులు, వారి పార్టీలోకి రావాలనుకున్న నాయ‌కుల‌ను కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా చేయ‌డంలో బీజేపీ కొంతవరకు విజ‌యం సాధించింద‌నే చెప్పొచ్చు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, కూన‌ శ్రీశైలం గౌడ్, మూల విక్రమ్ గౌడ్ వంటి వారు నేత‌లు రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్లో చేరేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని వార్తలు వచ్చొయి. బీజేపీలో ఉన్న ఈ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తే వారికి ఇబ్బందులు తప్పవని బీజేపీ నాయ‌కులు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకున్నారు. బీజేపీలోని ముఖ్యనేతలు రంగంలోకి దిగి వీళ్ల‌తో చర్చలు జరిపారు. అయితే కొందరు నాయ‌కుల‌ను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ పార్టీ మారడం లేదనే స్ప‌ష్టం చేశారు. ఇప్పటివ‌ర‌కైతే బీజేపీలోకి కొత్త నాయ‌కులు రాకపోయినా.. ఇదివ‌రకే ఉన్నా వారిని మళ్లీ వేరే పార్టీకి మారకుండా చూడాలని బీజేపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.