కెసిఆర్, బండి, రేవంత్.. మీ దుకాణాలు మూసుకోండి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్

కేసీఆర్, బండి, రేవంత్.. అందరికీ చెప్తున్న మీ దుకాణాలు బంద్ చేసుకోండి.. రాబోయేది బహుజన సమజ్ వాదీ పార్టీ కాలమని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గజ్వెల్ పట్టణం ప్రజ్ఞా గార్డెన్స్ లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా * ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఏనుగు గుర్తుకు , కారు గుర్తు కు లాడయి జరగబోతుందని.. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కు ఏ బడి కి పోవాలో తెలియడం లేదన్నారు.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా దోచుకోవాలనే ధ్యాసే తప్ప ప్రజల బాగు కోసం ఆలోచన లేదని మండిపడ్డారు. శాంతా బాయ్ చనిపోవడాని కారణం తెలంగాణ ప్రభుత్వమేనని.. అసైన్డ్ భూములు దున్నుకునే అర్హత మా గిరిజన రైతుల కు లేదా ..? అని నిలదీశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు బిసిల కుల గణన చేయడానికి ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. బిజెపి, టీఆరెస్ ఇద్దరు తోడు దొంగలని.. రాబోయేది బహుజన రాజ్యం.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఈటలను బీజేపీలో తీసుకెళ్లి ఓడగొడుతున్నారని తెలిపారు.