దుబ్బాక టూ జీహెచ్ఎంసీ బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఇది కేవలం రోజుల్లో జరిగిన పని కాదు. ఈ గెలుపులో బీజేపీ అనుసరించిన వ్యూహాల దగ్గరి నుండి ప్రభుత్వంపై వ్యతిరేకత వరకు అన్నీ కలసి వచ్చాయి. బీజేపీ పార్టీలో ఉన్న వారు దాదాపుగా హిందూయిజం, ఆర్ఎస్సెస్, ఇతర హిందూ సంబందిత సంస్థలకు చెందినవారు. బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరిదీ ఒకేరకమైన ఆలోచన ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అది అంతే.. ఆ పార్టీ పై ప్రేమ కావొచ్చు. గెలుపు బాటలో నడుస్తున్న బీజేపీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరమే..
ఎందుకంటే ఇన్ని రోజుల నుండి ఎవరి మీదనైతే పోరాటం చేశారో వారే ఆ పార్టీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు బీజేపీని చిన్న చూపు చూసిన ఇతర పార్టీ బడా నేతల చూపు బీజేపీపైకి మారింది. నియోజక వర్గ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఎవరినైతే వ్యతిరేకించారో వారితో కలిసి నడిచేందుకు అసంతృప్తితో ఉండటం సహజమే.. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఒక క్రమ శిక్షణ చూస్తాం.. అది పార్టీని, పార్టీ చేసే సూచనలు గౌరవించడం.
తగుదునమ్మా అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, మొదలైన పార్టీల్లో మసకబారిన మాస్ లీడర్లను బీజేపీ అక్కున చేర్చుకోవడం ఆ పార్టీ మూలాలనే ప్రశ్నార్థకం చేస్తుంది. సో కాల్డ్ నాయకులు రావడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అన్నది సామాన్య కార్యకర్తల మాట. ఎలాగంటే… కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల ఓటు బ్యాంకులో 30 శాతం ఇతర మతాలు ఉండొచ్చు. ఈ నాయకుల క్యాడర్‌లో కూడా దాదాపుగా అంతే శాతం మైనారిటీలు ఉండటం వల్ల.. ఈ నాయకులు బీజేపీలోకి వస్తే ఆ మైనారిటీ ఓట్లు మైనస్ అవడం ఖాయం.. అంతే కాదు బీజేపీ యిజాలు ఈ నాయకులు ఆచరించడంలో విఫలం అవడంతో పాటు పార్టీని ప్రతిష్ట కూడా దిగజారే ప్రమాదం ఉంది.. అంతేనా జంపిగులలో కోవర్టులు కూడా ఉండటం సహజమే కదా.. సో
బీజేపీ గనక సొంతంగా ఉండకుండా ఇతర పార్టీ నాయకులతో పార్టీని నింపేస్తే బందర దొడ్డి కావడం అనివార్యం.. ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లవుతుంది.. జాగ్రత్త