బీజేపీ నిర్ణయం.. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..!

-

రాజస్థాన్‌ అసెంబ్లీలో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ప్రకటించారు. రాజస్థాన్‌లోని బీజేపీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రాజస్తాన్‌లో రేపటి నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్ మీద చర్చిస్తామని ముఖ్యమంత్రి గెహ్లోత్ గవర్నర్‌ మీద పదే పదే ఒత్తిడి చేయడంతో చివరకు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇకపోతే 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. మిగిలిన 8 మంది ఇతర పార్టీలకు చెందిన వారు. కాగా, నెల రోజుల క్రితం అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news