ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై, తాజా పరిణామాలపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. దీంతో రాష్ట్రంలో మరింత గందరగోళం నెలకొంది. అసలు బోండా ఉమ చెప్పిన విషయం ఏంటంటే.. జూన్ 22 లోపు తనను చంపేందుకు వైసీపీ నేతలు డెడ్ లైన్ పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు. తనతో పాటు మరికొందరికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. టీడీపీ నేతల ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగితే వైసీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే అరెస్ట్ చేస్తున్నారని బోండా ఉమ మండిపడ్డారు. సీఎం జగన్ మాట వింటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో అధికారులపై చర్యలు తీసుకున్నారు కానీ, మంత్రిపై కాదని అన్నారు. ఈఎస్ఐ కొనుగోళ్లలో మంత్రికి సంబంధం ఉండదని కేంద్రం 2009లోనే చెప్పిందని ఉమ గుర్తు చేశారు.
సంచలనం : బోండా ఉమను చంపేందుకు కుట్ర..!
-