తాము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను కొనడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ ఎమ్మేల్సీని ప్రలోభ పెట్టామో ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేసారు. అసలు ఇలాంటి మండలి అవసరమా లేదా అన్న చర్చ జరుగుతుందన్నారు.
మండలి చైర్మన్ నిబంధనలకు తూట్లు పొడిచారని, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహారించారని, ప్రజా తీర్పుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని అన్నారు. చంద్రబాబుకి ఎన్నికల్లో అందుకే ప్రజలు బుద్ధ్హి చెప్పారన్నారు. చేతిలో మీడియా ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తే ఎలా అని బొత్సా ప్రశ్నించారు. యనమల వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసీడర్ అన్నారు బొత్స.
మండలి రద్దు అయితే లోకేష్ పరిస్థితి ఏంటి అని ఆయన ఎద్దేవా చేసారు. మండలి రాద్దుకి వక్ర బాష్యం చెప్తున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యేలను ఏ విధంగా కొన్నారో మనం చూసామని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలకు 5 కోటలో 10 కోట్లు ఎందుకు ఇస్తాం…? వాళ్ళు ఏమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్సా ఆరోపించారు.