బ్రేకింగ్; వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ళు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంతమైన అమరావతి రైతులు తమ పోరాటాన్ని ఉదృతం చేసారు. చిన కాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధనానికి వేలాది మంది రైతులు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సెగ వైసీపీ నేతలకు కూడా గట్టిగానే తగిలింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కారుని రైతులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని ఆయన కారుని పంపించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టగా, పిన్నెల్లి కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీనితో ఆయన కారు ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు బైఠాయించిన రైతులు,

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేస్తూ రైతులు ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు రైతులు దాడికి దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. వేలాది మంది రైతులు జాతీయ రహదారిపై భైటాయించారు. దీనితో రెండు గంటల పాటు ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news