కారు-కమలం నేతలకు కాంగ్రెస్ సీట్లు..బిగ్ ట్విస్ట్ అదే.!

-

రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వలసలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అలాగే సీనియర్ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళుతున్నారు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇంకా కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది. ఇక అంతే బాగానే ఉంది..కాంగ్రెస్ బలపడిందనే నేపథ్యంలో ఆ పార్టీలో ఊహించని మలుపు చోటు చేసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ సీట్లపై ఒక సర్వే చేసి ఆ రిపోర్టుని అధిష్టానానికి పంపారట. ఇక రిపోర్టు తయారుచేసింది వ్యూహకర్త సునీల్ కానుగోలు. అయితే ఈ రిపోర్టులో సీట్ల విషయంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయట. దాదాపు 51 నియోజకవర్గాల్లో ఇద్దరేసి చొప్పున సీటు కోసం పోటీ పడుతున్నారట. ఆ పోటీ నేతల పేర్లని సైతం రిపోర్టులో పెట్టారని తెలిసింది. అలాగే ఎవరికి ఎక్కువ మొగ్గు ఉందో వారికి నెంబర్ 1లో, మిగిలిన నేతని తర్వాత ఆర్డర్ లో ఉంచారట.

కానీ ఊహించని విషయం ఏంటంటే..ఆ రిపోర్టులో కాంగ్రెస్ లో ఉండే నేతల పేర్లు కంటే..బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల నుంచి వచ్చిన పేర్లే ఎక్కువ ఉన్నాయట. ఇంకా విశేషం ఏంటంటే..ఇంకా పార్టీలోకి రాని వారి పేర్లు కూడా పెట్టేశారని తెలిసింది. అలాగే కొందరు సీనియర్ నేతల పేర్లని సెకండ్ ఆప్షన్ లో పెట్టారని తెలిసింది. ఇక ఇదంతా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరగలేదట.

మొత్తం వ్యూహకర్త చూసుకున్నారని, ఆ రిపోర్టుని ఆయనే పైకి పంపించారని తెలిసింది. దీంతో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు సీట్లు ఎవరికి ఇస్తారు..చివరికి ఎవరు బరిలో ఉంటారో కూడా తెలియడం లేదు. ఇలాంటి పరిణామాల వల్ల పార్టీకే నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news