మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరినీ మళ్ళీ నిలబెడుతుందా? కేసిఆర్ అందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తారా? అంటే అది డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నదే 119 సీట్లు. అందులో 104 స్థానాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 15 సీట్లలోనే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేరు. దాదాపు 90 శాతం ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ వాళ్ళే. అలాంటప్పుడు అందరికీ సీట్లు ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని.
ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. సహజంగా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎక్కువ వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక వారి సీట్ల విషయంలోనే కేసిఆర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మామూలుగా కేసిఆర్ పాలన పరంగా పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రజలు కేసిఆర్‌నే సిఎంగా కోరుకుంటున్నారు. కాకపోతే ఎమ్మెల్యేల విషయంలోనే డౌట్ ఉంది. దీని వల్ల కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కేసిఆర్ కఠిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
అయితే ఇప్పటికే కేసిఆర్ దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తానని చెప్పారు. కానీ సరిగ్గా పనిచేయని వారిని మాత్రం పక్కన పెట్టేస్తామని అన్నారు. దీంతో పనితీరు సరిగ్గా లేని వారు దాదాపు 20 శాతం వరకు ఉన్నారని తెలుస్తుంది. అంటే సుమారు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని సమాచారం.
బిఆర్‌ఎస్ పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా అదే తేలిందని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కొందరు నేతలు కామెంట్ కూడా చేస్తున్నారు. ఓ 20 శాతం ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని అంటున్నారు. దీంతో వారిని మార్చే ఆలోచనలోనే కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ సీట్లలో బలమైన నేతలని రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఎవరికి సీటు ఇవ్వడం లేదో ఆ విషయం ఎన్నికల సమయంలోనే తేలుతుంది. మొత్తానికి కొందరు సిట్టింగులకు సీట్లు మాత్రం దక్కే ఛాన్స్ లేదు.