కొల్లాపూర్ పంచాయితీ..జూపల్లితో కారుకు రిస్క్.?

-

అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో నేతల మధ్య పంచాయితీ ఉన్న స్థానాల్లో కొల్లాపూర్ కూడా ఒకటి. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో..కొల్లాపూర్ లో పంచాయితీ పెద్దదైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భీరం..బి‌ఆర్‌ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు పోటీ చేశారు. విజయం భీరంని వరించింది.

ఇక కాంగ్రెస్ నుంచి కొన్ని రోజులకే ఆయన బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ కొట్టారు. అప్పటినుంచి కొల్లాపూర్లో భీరం వర్సెస్ జూపల్లి అన్నట్లు పంచాయితీ నడుస్తోంది. జూపల్లి వర్గాన్ని భీరం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు..దీంతో జూపల్లి సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. ఆ మధ్య మున్సిపాలిటీ ఎన్నికలో తన వర్గాన్ని నిలబెట్టుకుని గెలిచారు. కానీ తర్వాత కే‌టి‌ఆర్ సర్ది చెప్పడంతో..వారిని బి‌ఆర్‌ఎస్ లో కలిపారు. అయినా సరే కొల్లాపూర్ లో మాత్రం భీరం, జూపల్లి వర్గాల మధ్య పంచాయితీ నడుస్తూనే ఉంది. అదే సమయంలో నెక్స్ట్ కొల్లాపూర్ సీటు భీరంకే అని ప్రచారం జరుగుతుంది.

దీంతో జూపల్లి వర్గం భగ్గుమంటుంది. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా సరే జూపల్లి వర్గం తగ్గేలా లేదు. కొల్లాపూర్ సీటు కావాలనే జూపల్లి పట్టు మీద ఉన్నారు. ఒకవేళ సీటు దక్కకపోతే కాంగ్రెస్ లేదా బి‌జేపి లోకి వెళ్ళి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే కొల్లాపూర్ లో కారుకు డ్యామేజ్ తప్పదు.

ఒకవేళ ఏదొకటి సర్ది చెప్పి జూపల్లిని బి‌ఆర్‌ఎస్ లోనే ఉంచినా సరే..ఆయన వర్గం మాత్రం ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే భీరంకు మద్ధతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అంటే ఎటు చూసుకున్న కొల్లాపూర్ లో జూపల్లి వల్ల కారు పార్టీకి రిస్కే.

Read more RELATED
Recommended to you

Latest news