ఇల్లందు పోరు..హరిప్రియకు కష్టాలు..ఈ సారి డౌటే!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన వారితో..అదే బి‌ఆర్‌ఎస్ లో పోటీ చేసి ఓడిపోయిన నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇదే పోరు బి‌ఆర్‌ఎస్ పార్టీకి మైనస్ అయ్యేలా ఉంది. పైగా సిట్టింగుల సీట్లు అని కే‌సి‌ఆర్ ప్రకటించారు..దీంతో గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ లో ఓడిపోయిన నేతలు జంప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అందులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం నేతలు ఎక్కువ ఉన్నారు.

ఇదే క్రమంలో ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్ నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. కోరం ఏమో బి‌ఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు డౌట్. అందుకే ఆయన జంప్ అవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పొంగులేటికి మద్దతు పలికారు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి దూరం జరిగారు.

Banoth Haripriya Nayak || MLA Yellandu Constituency

దీంతో పొంగులేటితో పాటు ఆయన పార్టీ మారే ఛాన్స్ ఉంది. అయితే ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. పైగా ఇక్కడ కాంగ్రెస్ బలంగానే ఉంది. కాంగ్రెస్ ఇంచార్జ్ గా చీమల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్టులకు బలం ఉంది. ఒకవేళ కమ్యూనిస్టులతో బి‌ఆర్‌ఎస్ పార్టీకి పొత్తు ఉంటుంది కబట్టి.. హరిప్రియకు కాస్త అడ్వాంటేజ్ ఉండవచ్చు. కానీ కోరం కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేస్తే హరిప్రియకు రిస్క్ తప్పదు. అటు టీడీపీకి కాస్త బలం ఉంది..టీడీపీ పోటీ చేసి ఓట్లు చీలిస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే డ్యామేజ్. కాబట్టి ఈ సారి ఇల్లందులో హరిప్రియ గెలుపు సులువు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news