కాంగ్రెస్-ఎం‌ఐ‌ఎం-బీజేపీ సిట్టింగ్ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్ధులు వీరే.!

-

ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే కే‌సి‌ఆర్ దూకుడుతో రాజకీయం చేస్తున్నారు. ఊహించని విధంగా 115 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు. కేవలం 4 సీట్లని పెండింగ్ లో పెట్టారు. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ సీట్లని పెండింగ్ లో పెట్టారు. ఇక ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు. వేములవాడ, వైరా, ఉప్పల్, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, స్టేషన్ ఘనపూర్ సీట్లలో  అభ్యర్ధులని మార్చారు. అటు కే‌సి‌ఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దివంగత సాయన్న కుమార్తె లాస్య, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ తనయుడు సంజయ్ పోటీ చేస్తున్నారు.

ఈ సీట్లలో తప్ప..మిగతా సీట్లలో సిట్టింగులే పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పి సిట్టింగుల ఉన్నచోట్ల అభ్యర్ధులని ఖరారు చేశారు. ప్రస్తుతం 119 సీట్లు ఉంటే..అందులో 103 మంది బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 బి‌జే‌పి ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఖాళీ. ఇక కాంగ్రెస్ ఐదు సీట్లలో..బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులు వచ్చి ములుగులో సీతక్కపై నాగజ్యోతి, మంథనిలో శ్రీధర్  బాబుపై పుట్టా మధు, మధిరలో భట్టి విక్రమార్కపై కమలరాజు, భద్రాచలంలో వీరయ్యపై తెల్లం వెంకట్రావు, సంగారెడ్డిలో జగ్గారెడ్డిపై చింతా ప్రభాకర్ పోటీ చేస్తున్నారు.

ఎం‌ఐ‌ఎం సీట్లు..కార్వాన్ లో కృష్ణయ్య, మలక్ పేట లో తీగల అజిత్ రెడ్డి, నాంపల్లి ఇంకా ఫిక్స్ కాలేదు. ఛార్మినార్ లో ఇబ్రహిం, చాంద్రాయణగుట్టలో సీతారాం రెడ్డి, యాకుత్‌పురా లో సుందర్ రెడ్డి, బహదూర్‌పురా లో అలీ బక్రి బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు బి‌జే‌పి సీట్లు గోషామహల్లో ఇంకా అభ్యర్ధి డిసైడ్ కాలేదు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news