యువతలో యాంటీ..కారు కొత్త ప్లాన్.!

-

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని రాజకీయ పార్టీలలో హడావిడి మొదలైంది. తమ పార్టీ తరపున ఎవరిని నిలబడితే విజయం వరిస్తుందో, అందుకు ఎటువంటి వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయాలని అన్ని పార్టీలు ఆలోచనలో ఉన్నాయి. అధికార బిఆర్ఎస్ పై రాష్ట్రంలో ఎక్కువ వ్యతిరేకతతో ఉంది నిరుద్యోగ యువత. సొంత రాష్ట్రం వచ్చిన వారికి ఉద్యోగాలు పెద్దగా రాలేదు.

దీంతో వారికి బిఆర్ఎస్ అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి కచ్చితంగా బిఆర్ఎస్ ను ఓడించాలని రాష్ట్రంలోని నిరుద్యోగులంతా కంకణం కట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ ఓట్లు మొత్తం ఒకే పార్టీకి పడితే అది బిజెపి అయినా, కాంగ్రెస్ అయినా కచ్చితంగా విజయం సాధించి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అది బిఆర్ఎస్ కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అలా జరగకుండా ఉండడానికి బిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిఆర్ఎస్ భారీ వ్యూహరచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

brs party
brs party

కాంగ్రెస్ కు, బిజెపికి గట్టి పట్టున్న స్థానాలలో చిన్న పార్టీలు, లేదా ఇండిపెండెంట్లుగా కొందరు యువ నాయకులని బరిలో దింపి.. అభ్యర్థుల ఖర్చులు కూడా తామే భరిస్తామని బిఆర్ఎస్ హామీ ఇచ్చి..యువత  ఓట్లను చీల్చడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్ పావులు కదుపుతోందని తెలుస్తోంది. అలా చేస్తే యువత ఓట్లు చీలి కాంగ్రెస్, బి‌జే‌పిలకు నష్టం జరిగి తమకు మేలు జరుగుతుందని బి‌ఆర్‌ఎస్ ప్లాన్.

మరి బిఆర్ఎస్ లక్ష్యం నెరవేరి హ్యాట్రిక్ సాధించగలదా?ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news