ఆ జిల్లాల్లో టాప్ గేరులో కారు..మెజారిటీ పక్కా..!

-

కారు: ముచ్చటగా మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్..మూడోసారి కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. సాధారణంగా రెండుసార్లు అధికారంలోకి వస్తే కాస్త వ్యతిరేకత ఉంటుంది..ప్రతిపక్షాలు బలపడతాయి. కానీ తెలంగాణలో ఆ పరిస్తితి కనబడటం లేదు..ప్రభుత్వ పరంగా పెద్దగా వ్యతిరేకత కనబడటం లేదు.

అదే సమయంలో ప్రతిపక్షాలు సరిగ్గా బలపడకపోవడం బి‌ఆర్‌ఎస్‌కు పెద్ద బలం. అటు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బలపడలేదు..ఇటు బి‌జే‌పికి పూర్తి స్థాయిలో బలం లేదు. ఈ పరిస్తితుల నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్‌కు మూడోసారి అధికారం దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక బి‌ఆర్‌ఎస్‌ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ గా ఉంది..అలాగే ఆధిక్యంలో కూడా ఉంది. దీంతో మళ్ళీ బి‌ఆర్‌ఎస్‌కు తిరుగులేదనే పరిస్తితి ఉంది. బి‌ఆర్‌ఎస్‌కు కీలకంగా ఉన్న జిల్లాలు వచ్చి..రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలు..ఈ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి పక్కా లీడ్ ఉంది.

గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకే లీడ్ వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆధిక్యం రావడం పక్కా అని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పవచ్చు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కాస్త పోటీ ఉన్నా సరే బి‌ఆర్‌ఎస్‌ ఎడ్జ్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ జిల్లాల్లో లీడ్ ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్తితి.

ఇక హైదరాబాద్ లో 7 సీట్లు ఎం‌ఐ‌ఎంకు వదిలిపెడితే..మిగిలిన 8 సీట్లలో త్రిముఖ పోరు సాగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆధిక్యం ఎవరిదో చెప్పలేం. ఏదేమైనా మెజారిటీ జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ హవానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news