బైరెడ్డి సిద్ధార్థ్‌కు చంద్రబాబు చెక్ పెట్టగలరా?

-

ఏపీ రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. తక్కువ సమయంలోనే బైరెడ్డి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెనుక రాజకీయం నేర్చుకున్న సిద్ధార్థ్…ఆ తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో వైసీపీలోకి వచ్చేశారు. పార్టీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే సిద్ధార్థ్ ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తన పదునైన స్పీచ్‌లు, దూకుడుగా రాజకీయాలు చేయడం కలిసొచ్చాయి.

chandrababu naidu byreddy siddharth reddy

అందుకే జగన్ సైతం బైరెడ్డికి నందికొట్కూరు బాధ్యతలు అప్పగించారు. మామూలుగానే నందికొట్కూరుపై బైరెడ్డి ఫ్యామిలీకి పట్టు ఎక్కువ ఉంది. అయితే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిదానంగా పట్టు కోల్పోవడంతో సిద్ధార్థ్‌కు మంచి అవకాశం దక్కింది. 2019 ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం బైరెడ్డినే. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్థర్‌కు, బైరెడ్డికి పెద్దగా పొసగడం లేదు. తాను ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గంపై బైరెడ్డి పెత్తనం ఏంటి అని ఆర్థర్ అసంతృప్తిగా ఉన్నారు. వీరి ఇరు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు రచ్చ జరుగుతూనే ఉంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం కూడా ప్రయత్నిస్తూనే ఉంది.

కానీ వీరి రచ్చకు బ్రేక్ పడటం లేదు. అయితే వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్నా సరే, దాన్ని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టి‌డి‌పి ఉంది. ఇక్కడ టి‌డి‌పికి సరైన నాయకుడే లేరు. కీలకమైన నాయకులు ఇప్పటికే వైసీపీలోకి జంప్ చేశారు. ఇక గత ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయిన బండి జయరాజు అడ్రెస్ లేరు. దీంతో నందికొట్కూరులో సైకిల్ నడిపే నాథుడే లేడు. ఈ క్రమంలోనే బలమైన నాయకుడుని నందికొట్కూరులో పెట్టాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ టి‌డి‌పి తరుపున ఎవరు బరిలో దిగిన నందికొట్కూరులో బైరెడ్డిని నిలువరించడం కష్టమే అని తెలుస్తోంది. ఆయన ఒంటిచేత్తో వైసీపీని గెలిపించేలా ఉన్నారు. ఏదేమైనా బైరెడ్డికి చెక్ పెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news