కేటిఅర్ ప్రచారం చేస్తుంటే ఆవలిస్తూ నిద్రపోయిన అభ్యర్ధి

Join Our Community
follow manalokam on social media

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు… ఇప్పుడు బిజెపి, తెరాస మధ్య ఉన్న పోటీ గురించి అందరికి తెలుసు. సిఎం కేసీఆర్ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బిజెపిని ఎదుర్కొని నిలబడటానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో ఒక అభ్యర్ది వ్యవహారం హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ రోడ్డుషో లో కేటీఆర్ ఆవేశంగా ప్రసంగిస్తుంటే ప్రసంగం వింటూ అవలిస్తూ నిద్రమత్తులో వనస్థలిపురం కార్పొరేటర్ అభ్యర్థి జిట్టా రాజశేఖర్ రెడ్డి కనిపించారు.

ఒకపక్క టి ఆర్ ఎస్ పార్టీ మేయర్ పీఠం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం అందరికి కనపడుతుంది. నిన్న ఎల్ బి నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించి పార్టీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేసారు. ఈ తరుణంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జిట్టా రాజశేఖర్ రెడ్డి మాత్రం కేటీఆర్ పక్కనే నిల్చుని నిద్రపోతు అవలిస్తూ కన్పించారు. ఈ వార్త సోషల్ మీడియాలో హైలెట్ అయింది. ఇప్పుడు అయినా మేల్కొండి అంటూ సూచించారు.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...