బ్రేకింగ్: సొంత ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్టు చేయించిన జగన్..?

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అధికారం అండతో రెచ్చిపోయిన సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు. జగన్ నిర్ణయంతో వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కోటంరెడ్డి బెదిరించారంటూ ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు.

కోటంరెడ్డి ఎంపీడీవోపై దాడి చేసిన సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలోలేరు.. ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజిగా గడిపారు. జగన్ ఢిల్లీ నుంచి రాగానే.. నెల్లూరు ఘటనపై ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎంకు వివరాలు నివేదించారు.. చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీకి సీఎం స్పష్టంచేశారు.

చట్టాన్ని ధిక్కరించేవారు ఎవ్వరైనా ఉపేక్షించవద్దని డీజీపీకి జగన్ ఖరాఖండిగా చెప్పారుఆధారాలు ఉంటేచట్టప్రకారం ఏ చర్యకైనా వెనకాడవద్దని డీజీపీని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అంతే.. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. గతంలోనూ ఆయన ఓ జర్నలిస్టును బూతులు తిట్టిన ఆడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జమీన్ రైతు పత్రిక ఎడిటర్ పై కూడా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇలాంటి వారి ఉపేక్షించ కూడదనుకున్నారో ఏమో.. మొత్తానికి సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news