జగన్ కి కేంద్రం షాక్ ఇచ్చిందా…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ముఖ్యంగా సిబిఐ కేసుల విషయంలో జగన్ ను బిజెపి ఇబ్బంది పెట్టె అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా జగన్ బలంగా ఉన్నా సరే ఆయనకు ఉన్న కొన్ని చిక్కులు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం,

ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాసారు. తెలుగు రాష్ట్రాల సిబిఐ జేడీ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని నియమించాలి అని అమిత్ షా ని కోరారు విజయసాయి రెడ్డి. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా వెంటనే కేంద్రం సిబ్బంది వ్యవహారాల శాఖకు ఆదేశాలు కూడా జారి చేసారు. సిబిఐ మాజీ జెడి అయిన లక్ష్మీ నారాయణ తన సన్నిహిత వ్యక్తిని,

ఆ స్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అమిత్ షా కు ఫిర్యాదు చేసారు. దీనిపై విజయసాయి రెడ్డి కోరిన విధంగానే కేంద్రం స్పందించి హైదరాబాద్ సీబీఐ జేడీగా గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక నుంచి శశిధర్… జగన్ ఆస్తుల కేసులను పర్యవేక్షించనున్నారు. ఇది జగన్ కి గుడ్ న్యూసా లేక బ్యాడా అనేది అర్ధం కావడం లేదు.

గుజరాత్ మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం అక్కడి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టడంతో ఇబ్బందులు తప్పవని, అప్పుడు కేసు విషయంలో కేంద్రానికి మరింత పట్టు జగన్ విషయంలో దొరుకుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. జగన్ కి భవిష్యత్తులో మరింత ఇబ్బందికరంగా ఈ వ్యవహారం మారే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news