జగన్ కి కేంద్రం క్లాస్ పీకిందా…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కేంద్ర ప్రభుత్వం క్లాస్ పీకిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. వాస్తవానికి ఆయన విషయంలో కేంద్రం ముందు నుంచి కాస్త సానుకూలంగా ఉంటూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలతో పాటు గా ఆయన చేస్తున్న కొన్ని కక్ష సాధింపు పనులు ఇప్పుడు కేంద్రాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం.

విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ పై అంతర్జాతీయ మీడియా కొన్ని కథనాలు రాసింది. ఆంధ్రప్రదేశ్ గురించి ఈ మధ్య వార్తలు రాస్తుంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఇక ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్ళగా ఆయనతో రాజధాని గురించి కేంద్రం చర్చించినట్టు తెలుస్తుంది. రాజధాని ఎందుకు మారుస్తున్నారు అనే విషయాన్ని కూడా అమిత్ షా జగన్ ని అడిగినట్టు సమాచారం.

దీనికి జగన్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని అంటున్నారు. దీనికి తోడు జగన్ కి రాజధాని మార్చవద్దు అని కూడా అమిత్ షా చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కంటి వెలుగు కార్యక్రమం కోసం జగన్ కర్నూలు జిల్లా వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్ అసలు హైకోర్ట్ ఎందుకు వస్తుందో చెప్పలేదు. కనీసం అక్కడి ప్రజల ముందు మీకు రాజధాని వస్తుంది అని కూడా జగన్ చెప్పే ప్రయత్నం చేయలేదు.

దీనితో రాజధాని విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టత రావడం లేదు. చంద్రబాబుని తిట్టారు గాని రాజధాని గురించి మాత్రం ఆయన మాట్లాడ లేదు. దీనితో జగన్ కి కేంద్రం క్లాస్ పీకింది అని, ఇప్పటికే అంతర్జాతీయంగా జగన్ కారణంగా దేశం పరువు పోయింది అని కేంద్రం ఆగ్రహంగా ఉంది. అందుకే ఈ విషయంలో జగన్ ని కేంద్రం వెనక్కు తగ్గాలని సూచనలు చేసినట్టు సమాచారం.