జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుండి చంద్రబాబు కి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారని అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ టైంలో బాబుపై ఏపీలో వ్యతిరేకత రావటంతో టిడిపి నుండి మధ్యలోనే బయటకు రావడం జరిగింది. అటువంటి టైమ్ లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్…కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటకు పోకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారని మాట్లాడుతూ చంద్రబాబు పవన్ పార్ట్నర్స్ అంటూ చాలా గట్టిగా ప్రజలలోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే నాయకుల స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా వ్యవహరించడంతో ఇండైరెక్టుగా ప్రజలు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఒకే గూటికి చెందిన పక్షులు అని అర్థం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడం జరిగింది. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..మళ్లీ టీడీపీ కి సపోర్ట్ చేయటంతో ఆ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటు అయింది.
మేటర్ లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాల్లో బలంగా జనసేన పార్టీ ఉండటంతో అటువంటి స్థానాలలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధులను నిలబెట్టడం లేదు. మరికొన్ని చోట్ల టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టక పోవటంతో పాటుగా మరికొన్ని చోట జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పోటీ చేయడంతో…చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ బంధం ఇంకా కొనసాగుతోంది అని అంటున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ దాట్ల బుచ్చి బాబు, జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కలిసి ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు.