కేటీఆర్‌ సక్సెస్ వెనుక చంద్రబాబు..అప్పుడే అదే జరిగిందా

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ సక్సెస్ వెనుక టీడీపీ అధినేత చందబాబు ఉన్నారా? అంటే అసలు టీడీపీ లేనిదే కేటీఆర్ భవిష్యత్ ఉండేది కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా తనకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని, ఐ‌ఏ‌ఎస్ అవుదామనుకుంటే తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చేశానని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

ktr
ktr

అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, సిరిసిల్లలో మహేందర్ రెడ్డికి కేసీఆర్ ద్రోహం చేయడంతోనే కేటీఆర్‌కు సీటు వచ్చిందని అన్నారు. పైగా 2009 ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటే కేటీఆర్‌ని టీడీపీ గెలిపించిందని అన్నారు. ఇక అప్పుడు కొన్ని పరిస్తితులు కేటీఆర్‌కు అనుకూలంగా మార్చారనే చెప్పొచ్చు.

అప్పుడు అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్‌కు రాజకీయాలు కొత్త.  ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో కేటీఆర్‌ని బరిలో దింపాలని కేసీఆర్..సిరిసిల్లలో నిలబెట్టారు. అప్పటికే ఆ సీటులో మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని తప్పించి కేటీఆర్‌ని నిలబెట్టారు. పైగా 2009 ఎన్నికల్లో చంద్రబాబుతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు. పైగా అప్పుడు సిరిసిల్ల టీడీపీ సిట్టింగ్ సీటు. ఇక పొత్తులో భాగంగా ఆ సీటుని టీఆర్ఎస్‌కు ఇచ్చేశారు. దీంతో ఆ సీటులో కేటీఆర్ తొలిసారి నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కానీ 2009 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. టీడీపీ సపోర్ట్‌తోనే టీఆర్ఎస్ గెలవగలిగిందని చెప్పొచ్చు. అయితే టీడీపీతో పొత్తు నుంచి బయటకొచ్చి 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ ఉపఎన్నికలో కేటీఆర్ మళ్ళీ గెలిచారు. ఇక రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, సిరిసిల్లలో కేటీఆర్ బలం పెరగడం జరిగిపోయాయి. ఊహించని విధంగా కేటీఆర్ సొంత బలాన్ని పెంచుకున్నారు. అయితే మొదట్లో కేటీఆర్ పోలిటికల్ కెరీర్‌కు పునాది వేసింది చంద్రబాబే అని రేవంత్ అంటుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news