ఏపీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలయిన టీడీపీ, వైసీపీ ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి తమదే మంచి పార్టీ అని చెప్పుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు..
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇవాళ విశాఖ జిల్లా పెందుర్తిలోని సబ్బవరం జంక్షన్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన కొంచెం ఎమోషన్‌కు లోనయ్యారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం సాగింది.
రేపు అందరూ పేపర్లు చదవాలని.. జగన్‌పై ఎన్ని కేసులు ఉన్నాయో రేపు తెలుస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్‌లో తనపై ఎన్ని కేసులు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చెప్పాల్సిందేనని ఆయన తెలిపారు.
మీ పిల్లలను వైసీపీలోకి పంపకండి. కేసుల్లో ఇరుక్కునేలా చేసి.. జైలుకు పంపించే మహానాయకుడు జగన్.. అంటూ చంద్రబాబు విమర్శించారు. పన్నులు కడుతున్నాం కాబట్టే కేంద్రాన్ని తాము గట్టిగా నిలదీయగలుగుతున్నామని… కోడికత్తి పార్టీ అలా అడగలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దానికి కారణం జగన్‌పై ఉన్న సీబీఐ కేసులేనని చంద్రబాబు స్పష్టం చేశారు.