ఆ ఓటు బ్యాంకుపైనే బాబు గురి..జగన్‌ని దాటగలరా.!

-

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన తుది లక్ష్యం అధికారం సంపాదించడం..దాని కోసం ఎలాంటి వ్యూహాలతోనైనా ముందుకెళుతున్నారు. ఇక ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో..అటు జగన్..ఇటు చంద్రబాబు తమదైన శైలిలో వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. ఎవరికి వారు గెలుపు దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని చెప్పి జగన్ ప్లాన్ చేస్తున్నారు.

గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూనే.తానే మంచి సంక్షేమం చేశానని, కాబట్టి ప్రజలు తనకు మద్ధతుగా నిలవాలని కోరుతున్నారు. అంటే జగన్ సంక్షేమంపైనే ఆధారపడి ఉన్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం అదే సంక్షేమంపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ప్రజలపై సంక్షేమ వరాలు కురిపిస్తున్నారు. తాజాగా కీలక హామీలని ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి సంక్షేమ పథకాలతో కొన్ని కీలక వర్గాలని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా గెలుపోటములని తారుమారు చేసే..మహిళా, యువత, రైతు ఓటు బ్యాంకులపైనే ఫోకస్ పెట్టారు.

గత ఎన్నికల్లో జగన్ వన్‌సైడ్ గా గెలవడానికి ఈ మూడు వర్గాలే కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు వారిని టి‌డి‌పి వైపుకు తిప్పడానికి బాబు వారికి కీలక హామీలు ఇచ్చారు. మహానాడు వేదికగా మహిళలకు పలు హామీలు ఇచ్చారు. 18 నుంచి 59 ఏళ్ల వారికి నెలకు రూ.1500..తల్లికి వందనం అంటూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..అందరికీ ఏటా రూ.15 వేలు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ప్రకటించారు.

ఇటు యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం..నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇవ్వడం, అటు రైతులకు ఏడాదికి రూ.20 వేలు. ఇలా మూడు వర్గాలని టార్గెట్ చేసి బాబు హామీలు ఇచ్చారు. మరి ఆ మూడు వర్గాలు జగన్‌ని వదిలి బాబు వైపుకు వస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news