ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు…జగన్ ముందస్తుకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా? అనేది ఏ మాత్రం క్లారిటీ లేదు. అయితే రాజకీయ వర్గాల్లో అంచనా ప్రకారం..ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది..ఇటు జగన్ అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడపలేని పరిస్తితి. దీంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంతా భావిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటినుంచో ముందస్తు అని చెబుతున్నారు. ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోని ఎవరూ ఊహించలేదని చెప్పాలి. ఊహించని పథకాలతో ముందుకొచ్చారు. ఈ మేనిఫెస్టో వైసీపీని టెన్షన్ పెడుతుందనే చెప్పాలి. ఆరు అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించారు. మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్ అంటూ ఆరు అంశాలని చెప్పారు. ఇక వీటిల్లో కీలక పథకాలు వచ్చి..18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. జిల్లాల్లో ప్రయాణం చేసే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం.
తల్లికి వందనం పేరుతో..ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు, ఎంతమంది సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. నిరుద్యోగాలకు నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు..ఉద్యోగాలు కల్పించడం..రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వడం. ఇలా కీలకమైన హామీలని బాబు ఇచ్చారు.
అయితే ఈ హామీలు ప్రజలని ఆకర్షించేలా ఉన్నాయి. జగన్ చేయలేని పని బాబు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక వీటిని టిడిపి శ్రేణుల్లో ప్రజల్లో విస్తృతంగా తీసుకెళితే..టిడిపికి మహిళలు, యువత, రైతుల ఓట్లు భారీ స్థాయిలో పడతాయి.