‘బోరింగ్’ బాబు…జనంపై ఫ్రస్టేషన్ ఏంటి?

రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి…అందుకు తగ్గట్టుగా రాజకీయ నాయకులు కూడా మారుతున్నారు. కానీ టి‌డి‌పి అధినేత చంద్రబాబు మాత్రం మారుతున్నట్లు కనిపించడం లేదు. ఎంతసేపు అదే ఓల్డ్ పాలిటిక్స్ చేస్తూ జనాలకు బోర్ కొట్టిస్తున్నారు. రాజకీయమే కాదు…ఆయన స్పీచ్‌లు కూడా పాతవే. ఆ స్పీచ్‌లని జనాలే కాదు..సొంత టి‌డి‌పి కార్యకర్తలే పెద్దగా వినే పరిస్తితి కనిపించడం లేదు.

chandrababu

తాజాగా తమ పార్టీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులకు నిరసనగా చంద్రబాబు అదే ఆఫీసులో 36 గంటల దీక్ష చేశారు. ఈ క్రమంలోనే దీక్ష ముగింపు సందర్భంగా బాబు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయాన్నైనా సూటిగా స్పష్టంగా చెబితే జనాలకు అర్ధమవుతుంది. అలాగే ఏం మాట్లాడిన ప్రజలని ఆకట్టుకునేలా స్పీచ్‌లు ఉండాలి. కానీ బాబు స్పీచ్‌లు అలా ఉండవు…మొదట నుంచి అదే తీరు…ఇంకా అదే బోరింగ్ స్పీచ్‌లు. ఇక ఏకధాటిగా స్పీచ్ ఇస్తూ ఉండిపోతారు. కానీ అసలు పాయింట్లు రావు. ఏదో ఆవేశంగా మాట్లాడుతారు గానీ, అర్ధం ఉండదు.

తాజా స్పీచ్‌లో కూడా అదే పరిస్తితి….ఎక్కడైనా నాయకులు ప్రజలని ఆకట్టుకునేలా మాట్లాడాలి. జగన్, పవన్ కల్యాణ్‌లని చూస్తే అది అర్ధమైపోతుంది. ఏ విషయాన్నైనా సాగదీయరు…సూటిగా స్పష్టంగా..అది కూడా జనాలని ఆకర్షించేలా మాట్లాడుతారు. కానీ బాబు అలా కాదు…సాగదీసి, బోరు కొట్టేలా స్పీచ్‌లు ఇస్తారు. జనానికి బోరు కొడితే పర్లేదు…సొంత పార్టీ వాళ్ళకే బోర్ కొట్టేలా బాబు స్పీచ్ ఉంది.

దీనికి తోడు బాబు…ప్రజల మీద ఫ్రస్టేషన్ చూపిస్తారు. 2019 ఎన్నికల్లో జనం..జగన్‌ని గెలిపించిన దగ్గర నుంచి కూడా బాబు ఫ్రస్టేషన్ కనబడుతోంది. తాను ప్రజల కోసం చేస్తుంటే, ప్రజలు ఇంట్లో పడుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని అంటారు…అలాగే జనంపై తిరగబడాలని అంటారు. అంటే ఈయనకు జగన్ మీద ఉన్న ఫ్రస్టేషన్ అంతా జనంపై తీర్చేసుకుంటున్నారు. ఇక ఇలాగే బోరింగ్ స్పీచ్‌లు ఇస్తూ, జనంపై ఫ్రస్టేషన్ చూపిస్తే…మళ్ళీ అదే జనం ఫ్రస్టేషన్ పెంచేస్తారు.