ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు అంటూ దాదాపు మూడు వారాల క్రితం అనుకుంట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించి తెలుగుదేశం కంటి మీద కునుకు లేకుండా చేసేసింది. అమరావతితో పాటు మరో రెండు ఉంటాయని జగన్ చెప్పగానే చంద్రబాబులో ఒక్కసారిగా భయం మొదలయింది. వాస్తవం చెప్పాల౦టే అమరావతిలో భూములు కొన్నారో లేదో తెలియదు గాని చంద్రబాబుని నమ్మి ఆయన పార్టీ నేతలు,
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జాతీయ రహదారి మీద వందల ఎకరాలు కొనేసారు. ఇప్పుడు రాజధాని మారితే మాత్రం వాళ్లకు అప్పులకు వడ్డీలు పెరగడం ఉన్నవి అమ్మి కట్టడమే. ఇక అక్కడి నుంచి చంద్రబాబు మీద క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు రాజధాని మార్పుని ఆపడానికి, రైతుల బాధలను కూడా అర్ధం చేసుకుని పోరాటం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వేసిన కమిటీలను నానా మాటలూ అంటున్నారు.
అంటే అన్నారు గాని రాజధాని మార్పు మాత్రం ఆగేలా కనపడటం లేదు. దీనితో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. హస్తినకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇదిగో ఇది పరిస్థితి అని వివరించే ఆలోచనలో ఉన్నారు. అమిత్ షా ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని సమాచారం. మోడీ నిరాకరించినా సరే జెపి నడ్డా సహకారంతో షా ని కలిసి జగన్ మీద ఫిర్యాదు చేయడంతో పాటు, రాజధాని మార్పు మీ పరిధిలో లేకపోయినా కాస్త ఆపాలని కోరే అవకాశం ఉందట.