జగన్ అహం మీద కొట్టిన చంద్రబాబు, తట్టుకుంటారా…?

-

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. జగన్ ప్రభుత్వాన్నిఢీ కొనడం ఒక ఎత్తైతే వైఎస్సార్ పార్టీ తెలుగుదేశం నేతలకు వేస్తున్న గాలానికి చిక్కకుండా సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం ఒక ఎత్తు అయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చంద్రబాబు పార్టీ మరే వారిని ఆపలేకపోయారు. ఈ వలసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

వీరు వైసీపీలో చేరకపోయినప్పటికి అసెంబ్లీలో ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఈ జాబితాలో ఇంకెందరు చేరతారనే దానిపై టీడీపీలో మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ స్థాపించినప్పటినుంచి పార్టీలో కీలకంగా ఉన్న ప్రకాశం జిల్లా నేత కరణం బలరాం పార్టీ కి గుడ్ బై చెప్పారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మాజీమంత్రి పార్టీని వీడే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాళ్ళు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీని నుంచి సాధ్యమైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా…

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వైసీపీ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరో కీలక నేత మాజీమంత్రి అయిన శిద్దా రాఘవరావు ఇటీవల తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడంతో వైసీపీలోకి వెళ్లే వాళ్లు ఎవరనే దానిపై పార్టీలో అందరికి ఉత్కంఠ నెలకొంది. నేతలను కాపాడుకోలేక చంద్రబాబు నాయుడు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు వాయిదా పడటానికి చంద్రబాబు కారణమనే భావనలో జగన్ ఉన్నారు. దీనితో ఆయన అహం మీద కొట్టినట్టు అయిందని జగన్ కచ్చితంగా ఏదొకటి చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news