ఎవరికి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు…?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా ఆయనకు చరిత్రలో చూడని కష్టం వచ్చి పడింది. రాజధాని విషయంలో చంద్రబాబు ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. పది రోజుల క్రితం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. దీనితో పార్టీలో చీలిక వచ్చింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

రాజకీయంగా పార్టీని నిలబెడదాం అనుకునే సమయానికి జగన్ నుంచి వచ్చిన ఆ ప్రకటనతో ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పుడు జగన్ రాజధాని మార్చడం అనేది దాదాపుగా ఖరారు అయిపోయిందనే చెప్పాలి. దీనితో చంద్రబాబుపై దాదాపు ఆరు జిల్లాల నేతల నుంచి ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది. వాళ్ళు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ లో కూడా ఒకరకమైన భయం ఏర్పడింది.

ఉత్తరాంధ్ర నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో లేరనే చెప్పాలి. రాయలసీమ నేతలు కూడా జగన్ ని స్వాగతించారు. దీనితో ఇప్పుడు చంద్రబాబు ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరిని శాంతింప చేసే పరిస్థితిలో ఆయన లేరని అంటున్నారు. జగన్ రాజధాని మార్చేస్తే మాత్రం దాదాపు ఆరు జిల్లాల్లో చంద్రబాబుని నమ్మే పరిస్థితి ఉండదు. ఆయనను నమ్మి భూములు ఇచ్చారు. అయితే రాజధాని రైతులకు మద్దతు ఇవ్వడంపై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news