ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. ఆ సమయములో వనజాక్షి పై చేయి చేసుకోవడం ఆ తరువాత అసెంబ్లీలో వైయస్ జగన్ ని ఉద్దేశించి దారుణంగా విమర్శించి రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. నిత్యం వివాదాల్లో ఉండే చింతమనేని ప్రభాకర్ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో జగన్ ప్రభుత్వం వచ్చాక ఇటీవల అరెస్టు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన నియోజకవర్గంలో విజయరాయి ప్రాంతంలో తన వాహనం వెళ్తున్న టైంలో రోడ్డుపై భారీ యాక్సిడెంట్ జరగటంతో అటుగా వెళ్తున్న చింతమనేని ఆ క్షతగాత్రుడిని చూసి, చలించిపోయి, తానే స్వయంగా తన కారులోనే ఎక్కించుకొని మరీ, స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తూ, తన గొప్ప మనసును చాటుకున్నారు.
బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి లారీ బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆపద్బాంధవుడు లా చింతమనేని అతన్ని ఆదుకోవడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ విషయం తెలియగానే చంద్రబాబు…చింతమనేని కి ఫోన్ చేసి నాయకుడు అనిపించావ్ అని అభినందించారట.