చంద్రబాబు టార్గెట్ 2024? ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సంప్రదింపులు?

682

గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ మీటింగ్‌లోనూ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోండంటూ టీడీపీ నేతలకు బాబు సూచించారట. అంతే కాదు.. వచ్చేసారి టీడీపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలను చెప్పారట బాబు.

రాజకీయాల్లోనే కాదు.. ఎక్కడైనా గెలుపు ఓటములు అనేది సహజం. మనిషిని గెలుపు ఎలా పలకరిస్తుందో.. ఓటమి కూడా పలకరిస్తుంది. నిజానికి.. ఈ ప్రపంచంలో ఓడిపోని వ్యక్తే లేడు. అందుకే.. గెలుపుఓటములను పట్టించుకోకుండా.. మన పని చేసుకుంటూ ముందుకు వెళ్లడమే.. అని అనుకుంటున్నారేమో చంద్రబాబు 2019 పోతేనేం.. 2024 ఉంది కదా.. 2024లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారట.

దాని కోసం ముందుగా టీడీపీ నేతల్లో ఆత్మైస్థెర్యం నూరిపోస్తున్నారట. ఇటీవల గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ మీటింగ్‌లోనూ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోండంటూ టీడీపీ నేతలకు బాబు సూచించారట. అంతే కాదు.. వచ్చేసారి టీడీపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలను చెప్పారట బాబు.

అలాగే.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర ఎనలేనిది. ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే.. ఈసారి ప్రశాంత్ కిశోర్‌తో టీడీపీ ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందట.

వైసీపీ విజయంలో నవరత్నాల పథకాలు కీలక పాత్ర పోషించాయి. ఆ పథకాలకు రూపకల్పన చేసింది ప్రశాంత్ కిశోర్ టీమే. జగన్ పాదయాత్ర దగ్గర్నుంచి… పార్టీ అభ్యర్థుల ఎన్నిక.. ప్రచారం.. ఎన్నికల హామీలు.. ఇలా ప్రతి ఒక్కటి ప్రశాంత్ కిశోర్ టీమే జగన్‌కు చేసి పెట్టింది.

అయితే.. ఈ ఎన్నికలతోనే ప్రశాంత్ కిశోర్ కాంట్రాక్ట్ వైఎస్సార్సీపీతో ముగిసిందట. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ సంస్థతో టైఅప్ కావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఈమేరకు వాళ్లతో సంప్రదింపులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారట. టీడీపీ ముఖ్య నాయకులు కూడా చంద్రబాబుకు అదే చెప్పారట. ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని సలహా ఇచ్చారట. చూద్దాం.. మరి ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో టైఅప్ అవుతారా? లేదా?