చంద్ర‌బాబు చేసిన ఒక్క ట్వీట్‌తో ఆయన ప‌రువంతా పాయే…!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై ఇటీవ‌ల కాలంలో దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దానికి, ప్ర‌భుత్వానికి లింకు పెట్టి ఆయ‌న ఉతికి ఆరేస్తున్నారు.ఇక‌, ఆయ‌న అనుకూల మీడియా కూడా ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతోంది. అయితే.. కొన్ని కొన్ని సార్లు ఈ దూకుడే.. చంద్ర‌బాబుకు భారీ మైన‌స్ అయిపోతోంది. ఇన్నాళ్లుగా ఆయ‌న సంపాయించుకున్న క్రెడిట్ కూడా ఒక్క నిముషంలో కొలాప్స్ అయిపోతోంది.

మ‌రి ఆయా విష‌యాల్లో చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డుతున్నారా?  లేక తొట్రుపాటు ప‌డుతున్నారా?  లేక ఇంకెవ‌రైనా స్పందించ‌క ముందే తాను రియాక్ట్ అయి.. క్రెడిట్ కొట్టేయాల‌ను కుంటున్నారో తెలియదు కానీ.. త‌ప్పులో కాలేసి.. తీసుకోలేనంత ప‌రాభ‌వం మూట‌గ‌ట్టుకుంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌కు నిద‌ర్శ‌న‌మే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు భారీ కామెంట్ల‌తో చేసిన‌ ట్వీట్‌..దానికి ట్యాగ్ చేసిన ఫొటో.. క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో ఒక పోలీసు అధికారిని మ‌రో వ్య‌క్తి.. కొడుతున్న‌ట్టే ఉంది. దీంతో వెంట‌నే చంద్రబాబు రియాక్ట్ అయిపోయారు.

“రాష్ట్రంలో ఎంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయో… చెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. ఓ పోలీసు అధికారిని వైసీపీ గూండాలు.. చిత‌క్కొడుతున్నా.. అడిగే దిక్క‌లేకుండా పోయింది. విశాఖ‌లో టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ఆఫీస్ ద‌గ్గ‌ర ఇలా పోలీసును కొడుతున్నారు. దీనిని బ‌ట్టి రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎలా ఉన్నాయో అర్ధ‌మ‌వుతుంది. పోలీసుల‌కే ర‌క్ష‌ణ లేకుండా పోయింది!“ అని ఇంగ్లీష్‌లో కామెంట్ చేశారు.


దీంతో టీడీపీ అనుకూల ‌మీడియా దీనికి ప్రాధాన్యం ఇచ్చి.. వైర‌ల్ చేసేందుకు రెడీ అయి.. ఒక్క‌సారి ఎందుకైనా మంచిద‌ని.. స‌ద‌రు పోలీసు అధికారినే వివ‌ర‌ణ కోరింది. దీంతో ఆయ‌న చెప్పిన విష‌యం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది బాబు అనుకూల మీడియా. “నేను విధుల్లో ఉన్నాను. వెనుక వచ్చిన ఆటో దూసుకుంటూ వెళ్ల‌డంతో ప‌ట్టుత‌ప్పి నేల‌పై ప‌డిపోయాను. వెంట‌నే అటుగా వెళ్తున్న వైసీపీ నాయ‌కులు గ‌మ‌నించి న‌న్ను పైకిలేపి.. నీళ్లు తాగించారు“ అని స‌ద‌రు పోలీసు అధికారి వివ‌ర‌ణ ఇచ్చారు.

దీంతో చంద్ర‌బాబు ప‌రువు మొత్తం పోయిన‌ట్టు అయింది. గ‌తంలోనూ గుంటూరు జిల్లా పోలీసులు పేకాట ఆడుతున్నారంటూ.. ఎక్క‌డో ఒడిసాలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోను తీసుకువ‌చ్చి.. త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు బాబు. అది త‌ప్ప‌ని తెలిసి.. కొన్ని గంట‌ల్లోనే డిలీట్ చేశారు. మ‌రి ఎందుకింతఅత్యుత్సాహ‌మో అర్ధం కావ‌డం లేద‌ని బాబు సానుభూతిప‌రులు కూడా వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news