‘ప్రజా చైతన్య యాత్ర’ పేరిట నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా అడుగడుగున యాత్రలో చంద్రబాబు కి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర పరాభవం ఇటీవల ఎదురుగా గా ఆ తర్వాత విశాఖపట్టణం లో కూడా దారుణంగా ప్రజలనుండి వ్యతిరేకత రావడంతో వెనక్కి తిరిగి విమానమెక్కి హైదరాబాద్ వెళ్లి పోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు కి పట్టిన గతే నారా లోకేష్ కి కూడా అడుగడుగున నిరసన సెగలు తగిలాయి. విషయంలోకి వెళితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం లో నారా లోకేష్ ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. యాత్రలో భాగంగా మునికూడలి వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పురుషోత్తపట్టం పథకం కోసం తమను ఇబ్బంది గా పెట్టారని ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన చేస్తూ కాటవరం రైతులు నిరసనకు దిగారు. ఈ సమయంలో ఈ మార్గాన లోకేశ్ యాత్ర చేపట్టాడు. మునికూడలికి చేరగానే రైతులు లోకేశ్ తీరును ఎండగట్టారు. ఆ నిర్వాసితులే లోకేశ్ యాత్రను అడ్డుకున్నారు.
ఇదే సమయంలో నిరసనకారులకు మద్దతుగా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు వచ్చి ఆంధ్ర పప్పు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా జయంతికి వర్ధంతికి కూడా తెలియని నారా లోకేష్ అంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆందోళనలు ఎక్కువైపోతున్న క్రమంలో నారా లోకేష్ వెనుతిరిగి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ముందే చెప్పాను కదా ఉభయగోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర అప్పుడే స్టార్ట్ చేయొద్దని వినిపించుకోలేదు ఇప్పుడు చూడు ఏమైందో అంటూ లోకేష్ కి క్లాస్ తీసుకున్నారట.