బాబు అదిరిపోయే స్ట్రాటజీ…ఆ మంత్రుల ప్రత్యర్ధులు చేంజ్?

-

ఏపీలో నిదానంగా పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. గతనికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం నడిపిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైన తీసుకోవడానికి వెనుకాడటం లేదు. పార్టీలో సరిగ్గా పనిచేయని నాయకులని నిర్మొహమాటంగా పక్కన పెట్టడానికి ఇబ్బంది పడటం లేదు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకులని మార్చేశారు. ఇంచార్జ్‌లుగా ఫెయిల్ వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇలా పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.

chandrababu naiduఇదే క్రమంలో ఇంకా చాలా చోట్ల మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అలాగే ఏపీ మంత్రులకు చెక్ పెట్టడానికి సరికొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఏపీ మంత్రులు ఏ స్థాయిలో చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారో తెలిసిందే. వారు మంత్రులుగా ఎలా పనిచేస్తున్నారో తెలియదు గానీ…చంద్రబాబుని ఒక ఆట ఆడటంలో ముందు ఉంటున్నారు. అందుకే మంత్రులకు చెక్ పెడితే..వైసీపీని కాస్త నిలువరించగలుగుతామని బాబు భావిస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు మంత్రుల ప్రత్యర్ధులని మార్చడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పటికే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యర్ధిని మార్చేశారు. అలాగే కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, మేకపాటి గౌతమ్ రెడ్డిల ప్రత్యర్ధులని మార్చేయనున్నారు.

మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలని మార్చడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్‌గా చల్లా రామచంద్రారెడ్డిని నియమించారు. అటు అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో టీడీపీ ఇంచార్జ్‌గా కోరాడ రాజబాబుని పెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాజబాబుని కూడా మార్చవచ్చు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఎక్కడకక్కడ మంత్రులకు గట్టి పోటీగా టీడీపీ నేతలని నిలబెట్టడానికి బాబు రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news