తెలంగాణా మంత్రి వర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కేసిఆర్ మంత్రి వర్గంలో సీనియర్లను పూర్తిగా తప్పిస్తారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేసిఆర్ తప్పుకుని, కేటిఆర్ కి బాధ్యతలు అప్పగిస్తారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కేసిఆర్ సూపర్ సిఎం గా ఉంటారు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా… జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ విధంగానే ఉన్నాయని అంటున్నారు. కేటిఆర్ విషయంలో కొందరు సీనియర్ మంత్రులు అసహనంగా ఉన్నారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. వచ్చే ఏడాది మే తర్వాత కేటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనితో యువ మంత్రులను… కేబినేట్ లోకి తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నారట. అలాగే కొందరు శాఖలు కూడా మార్చాలనే యోచనలో ఉన్నారట.
హరీష్ కి ఆర్ధిక శాఖతో పాటు మరో కీలక శాఖ అప్పగించాలని… అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కూడా శాఖ మార్చే అవకాశం ఉందని అంటున్నారు. కొందరు యువ ఎమ్మెల్యేలకు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారని, మార్చ్ లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేటిఆర్ దీనిపై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఆర్టీసి ఉద్యమం సమయంలో కొందరు మంత్రులు విఫలం అయ్యారు… వారిని కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది.