ఈ మధ్య చాలా రాష్ట్రాల్లో సీఎం లను చేంజ్ చేస్తున్న బీజేపీ పెను సంచలనాలు రేపుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ పెద్దలు తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలు రేపుతోంది. అదేంటంటే అందరూ కూడా తెలంగాణలో త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని, లేదంటే మారిపోతుందని తామే అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారు. ఈ రాజకీయాలు ఇప్పుడు అన్ని పార్టీలను అయోమయంలో పడేస్తున్నాయి. వీటిని చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా త్వరలోనే పెను మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేయడం వెనక కూడా కేంద్ర పెద్దల ప్లాన్ ఉన్నట్టు సమాచారం. వారి అండదండలతోనే పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ యాత్రతో స్పష్టమైన మార్పు వస్తుందని ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ కేంద్ర పెద్దలు తెలంగాణ రాజకీయాలపై గట్టి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారి టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి రావడమే అన్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 17 న నిర్మల్ జిల్లాలో ఆ పార్టీ తెలంగాణ విమోచన సభ నిర్వహిస్తోందని సమాచారం. ఈ సభతో అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై కీలకమైన సందేశం ఇచ్చే అవకాశం కూడా ఉంది. 17న బహిరంగ సభ నిర్వహంచి తెలంగాణంలో కేసీఆర్ పాలనలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని అక్రమాలపై కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే రాజకీయ మార్పు తథ్యమని ఇప్పటికే తరుణ్ చుగ్ లాంటి వారు చెబుతున్నారు. ఇకపోతే త్వరలోనే కొత్త ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి రానున్న రాజకీయాలు ఎలా ఉంటాయో.