ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో పూసపాటి రాజులకు మంచి చరిత్ర ఉంది. చాలా శతాబ్దాల పాటు ప్రజాస్వామ్యాన్ని రాచరికంగా పరిపాలించి గత రెండు తరాలుగా అనేక పదవులు అనుభవించటం జరిగింది. ఆ రాచరికాన్ని అనుభవిస్తూ చంద్రబాబు హయాంలో కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు ఓ వెలుగు వెలిగి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్ ధాటికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ప్రముఖులు ఓడిపోయిన వాళ్ళలో కూడా అశోక్ గజపతి రాజు తన కూతురు అదితి గజపతి రాజు ఉంది. దీంతో విజయనగరంలో అశోక్ గజపతిరాజు కి చెక్ పెట్టడానికి వైసిపి అశోక్ అన్నయ్య ఆనంద్ గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు నీ రంగంలోకి దింపింది.ఈ సందర్భంలో మాన్సాస్ చైర్ పర్సన్, అదే విధంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం కి చైర్ పర్సన్ పదవులను అప్పజెప్పడం జరిగింది. దీంతో అశోక్ గజపతిరాజు నియోజకవర్గంలో సంచయిత గజపతి రాజు నీ పొలిటికల్ ప్లేయర్ గా వైసిపి హైకమాండ్ తన గ్రీప్ లో పెట్టుకుంది. భవిష్యత్తులో ఆమెను అశోక్ కోటలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయించటానికి వైసిపి ఇప్పటినుండి సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది.
ఇటువంటి తరుణంలో సంచయిత గజపతి రాజు కి పోటీగా…తన కూతురు అదితి గజపతిరాజు నీ పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు అశోక్ గజపతి రాజు. గత ఎన్నికల టైంలో తన కూతురిని ఇంటిలో కూర్చోబెట్టి మొత్తం వ్యవహారం చూసుకున్న అశోక్ గజపతిరాజు ఇప్పుడు…పూర్తి బాధ్యతలు అదితి గజపతిరాజు కి సంచయిత గజపతి రాజు పోటీగా దింపేశారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విజయశాంతి మాదిరిగా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై అన్ని విధాల పోరాటాలు చేయడానికి ప్రజల తరఫున మాట్లాడటానికి సరైన స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.