యూపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆసనాలు వేసిన ముఖ్యమంత్రి యోగీ ఆదిద్యనాథ్‌

-

ఉత్తరప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామాలు,పట్టణాలు,నగరాల్లో యోగా వైభవం కనిపించింది. రాష్ట్రంలోని 58,189 గ్రామ పంచాయితీలు, 762 మునిసిపాలిటీలు,అమృత్ సరోవరాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు,ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో యోగా దినోత్సవం జరుపుకున్నారు.వసుధైవ కుటుంబం “హర్ ఘర్-ఆంగన్ యోగా” అనే థీమ్‌తో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు,అధికసంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు.

ఇక రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్, గోరఖ్‌నాథ్ ఆలయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగాసనాలు వేశారు.మరోవైపు విధానసభ స్పీకర్ సతీష్ మహానా కాన్పూర్‌లో, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ రాజ్ భవన్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్నారు.గ్రామాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా కనిపించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ “హర్ ఘర్-అంగన్ యోగా” ప్రతి గ్రామంలో ప్రతిధ్వనిస్తోంది. చెరువులు, అమృత్ సరోవర్లు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పార్కులు, స్టేడియంలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో యోగా వ్యాయామాలు నిర్వహించారు.యోగా దినోత్సవం సందర్భంగా నమామి గంగే కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం తరపున 95 వేలకు పైగా నీటి కమిటీలు రాష్ట్రంలో యోగా కార్యక్రమాలను నిర్వహించాయి.జల్ జీవన్ మిషన్ కింద గ్రామ స్థాయి కమిటీలు, వాటర్ ట్యాంక్ ఆవరణలు, ప్రాజెక్టు ఆవరణలు, గ్రామ పంచాయతీలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది మొత్తం జీవన విధానాన్ని క్రమశిక్షణలో పెట్టే ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. మొదటి నుంచి యోగా సనాతన సంప్రదాయంలో అంతర్భాగమని ఆయన చెప్పారు.శరీరం,మనస్సు రెండింటినీ యోగా ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు.సామూహిక యోగా వ్యాయామ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news