కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దు రేవంత్‌రెడ్డికి కోర్టు ఆదేశం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై ఇవాళ సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. తనపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ పిటిషన్‌ వెయ్యగా.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు పిటిషనర్. అయితే పిటిషనర్ వాదనలు విన్న సిటీ సివిల్ కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR
రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా మీడియా లో ఉన్న లింక్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు డ్రగ్స్ కేస్ లో , ఈడి కేస్ లో కే టి ఆర్ పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదు అని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది సిటీ సివిల్ కోర్టు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ తీర్పు పై కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 20 కు వాయిదా సిటీ సివిల్ కోర్టు.