ఏపీ బీపీ : సీఎం గ్రాఫ్ సూప‌ర్ కానీ..? ఎందుక‌ని !

-

ఆంధ్రావ‌ని వాకిట వైఎస్సార్సీపీ పాల‌న‌కు మూడేళ్లు పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్భంగా  ముఖ్య‌మంత్రి వైఎస్.జ‌గ‌న్ గ‌తం క‌న్నా ఇప్పుడు దూసుకుపోతున్నారు. వ‌రుస సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తూ అమ‌లు చేస్తూ ఒక్క బ‌ట‌న్ ప్రెస్ చేయ‌డంతోనే ల‌బ్ధిదారుల జీవితాల్లో ఆనందం నింపుతున్నారు. అర్హ‌త మేర‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను చేరువ చేసేందుకు వీలున్నంత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దేశంలోనే ఎక్క‌డా లేనివిధంగా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ త‌న‌దైన పంథాలో పాల‌న సాగిస్తున్నారు.

కొన్ని సార్లు నిధులు చాల‌కున్నా ఇచ్చిన మాట క‌ట్టుబ‌డి ఉంటాన‌ని పేర్కొంటూ, అప్పులు సైతం చేసి పాల‌న సాగిస్తున్న త‌రుణాలు అనేకం ఉన్నాయి. ఇవే విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఉన్నంత మేర‌కు పాల‌న సాగిస్తే చాలు అని, అప్పులు చేసి పాల‌న సాగించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని విప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తోంది. కేంద్రం కూడా అప్పులకు సంబంధించి ఆంక్ష‌లు విధిస్తోంది.అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం వీలున్నంత మేర అప్పులు చేసి సంక్షేమ ప‌థ‌కాల క్యాలెండ‌ర్ ను అమ‌లు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. విమ‌ర్శ‌ల‌కు కూడా అస్స‌లు విలువ అన్న‌ది ఇవ్వ‌కుండా మున్ముందుకు వెళ్తోంది.ఒక్కోసారి ఇవి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలుగానే ఉన్నాయి అన్న‌ది  సొంత పార్టీ నుంచి కూడా విమ‌ర్శ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ప్లీన‌రీ వేళ (ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి)  చాలా అంటే చాలా అభిప్రాయాలు స్ప‌ష్టంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క బ‌ట‌న్ ప్రెస్ చేయ‌డంతో సీఎం గ్రాఫ్  పెరిగిపోతోంద‌ని కానీ గ్రామాల్లో ప‌నులు కాకుండా ఉంటే తాము గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని తేలిపోతోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధులు ఇస్తామ‌న్నా అవి కూడా ఎప్పుడు వ‌స్తాయో అన్న‌ది కూడా తేల‌ని లేదా తెలియ‌ని స్థితిగానే ఉంది. సాధార‌ణంగా గ్రామ స్థాయిలో చిన్న,చిన్న ప‌నులు చేసేందుకు కూడా నిధులు లేకుండా పోతున్నాయ‌ని తెలుస్తోంది. క‌నీసం పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు బ్లీచింగ్ పౌడ‌ర్ లాంటివి కొనుగోలు చేయాల‌న్నా, పీహెచ్సీలకు మందులు కొనుగోలు చేసి ఇవ్వాల‌న్నా  ఈ విధంగా ఏం చేయాల‌న్నా నిధుల లేమి వె న్నాడుతోంది. కొన్ని చోట్ల కింది స్థాయి ఉద్యోగుల జీత‌భ‌త్యాలు కూడా ఆగి ఆగి వ‌స్తున్నాయి. ఇటువంటి త‌రుణంలో కార్య‌క‌ర్త‌లు ప‌నులు అందుకున్నాక ఆస్తులు అమ్ముకుంటున్నార‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. స‌కాలంలో బిల్లులు రాక‌పోవ‌డంతో ప్ర‌తిచోటా ఇటువంటి దుఃస్థితే చోటుచేసుకుంటున్న‌ద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news