ప్రజల సొమ్ముతో కేసీఆర్‌ ప్రచారం సోకులు : మధుయాష్కీ గౌడ్‌

-

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రచారార్భాటానికి కోట్ల రూపాయల ప్రజాధనం వ్రుధా అవుతోందంటూ ఆరోపణ చేశారు మధుయాష్కీ. దేశవ్యాప్త పత్రికలకు, తాజాగా ప్రభుత్వ ప్రచారానికి.. తాజాగా హైదరాబాద్ లోనూ కల్వకుంట్ల చేసుకుంటున్న సొంత ప్రచారానికి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వాడుకుంటున్నాడని, రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోక ప్రజల సొమ్మును తన సొంత ప్రచారాలకు ఖర్చు చేస్తున్నాడని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న బాసర విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక చేసిన ధర్నాలు చూశాము.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాల్లోనూ అదే పరిస్థితి ఉందన్న మధు యాష్కీ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రచార యావ కోసం పెడుతున్న ఖర్చును రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం ఖర్చుపెడితే బాగుడేందన్నారు.

United we conquer, Madhu lectures Revanth- The New Indian Express

లేక ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలల మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తే కొంతలో కొంతైనా ప్రజలకు మేలు జరిగేదని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. మీడియాకు ఇస్తున్న ప్రకటనల ప్రజలసొమ్మును ప్రజా అవసరాల కోసం, పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తే పేదలకు ఆసరా దొరికేదని, ప్రజలకట్టిన పన్నుల ద్వారా ఖజానాకు వచ్చిన సొమ్మును కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ప్రచార సోకుల కోసం ఖర్చు పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నానని మధుయాష్కీ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news