కరోనాపై ఏపి అలెర్ట్, రంగంలోకి దిగిన జగన్…!

-

తెలుగు రాష్ట్రాలకు కరోనా వైరస్ వచ్చిన నేపధ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఆస్పత్రిని కేటాయించాలి అని నిర్ణయం తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ లో కరోనా రాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

చర్యలకు దిగాల్సిన సమయం ఆసన్నమైందని, ముందుగానే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. అటు ప్రజలు కూడా ఆయన పలు సూచనలు చేసారు. సమయ౦ జాగ్రత్తలు తీసుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జగన్… ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇక ప్రజలు ఎవరూ ఆందోళనకు గురి కావోద్దని జగన్ పేర్కొన్నారు. ప్రమాదకర కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. వీలైనన్ని మాస్కులు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేసారు. గ్రామ సచివాలయాల్లో కరోనాపై సూచనలు, జాగ్రత్తలతో కూడిన కరపత్రాలు ఉంచాలని సూచించారు జగన్. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news