ఏపీ రైతులకు సిఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 14.58 లక్షల రైతుల ఖాతాల్లో రూ.510 కోట్లు జమ చేసారు. వర్షాలు, వరదలు వల్ల దెబ్బతిన్న పంటలకూ పెట్టుబడి రాయితీ విడుదల చేసారు. 132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసారు. క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ విడుదల చేసారు.
కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసారు సిఎం జగన్. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని ఆయన పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో సిఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని ఆయన అన్నారు.