భీమిలిలో రేపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్… దిశ నిర్దేశం చేయనున్న సీఎం వైయస్ జగన్

-

టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే చాలు అది నిజమే అని నమ్మేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని నడిపించే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ పదం ఇప్పుడు ఓ సెన్షేషన్ గా మారింది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు.

ఎలాంటి అంశాన్నైనా అందరికీ అర్థమయ్యేలా అందించడమే వీరి ప్రత్యేకత.దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్‌ మీడియాలో వీరి ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశమవుతాయి కూడా.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు.

ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా ఉంది.ఇందులో భాగంగానే వైయస్ఆర్‌సీపీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రచారానికి సిద్ధమైంది.ఈనెల 23న మంగళవారం నాడు భీమిలిలో ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైయస్ఆర్‌సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు రానున్నారు.సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులు… ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న ఈ కొద్దికాలం ఏ పార్టీకైనా ఎంతో విలువైనది. ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి సీన్ జగన్ సిద్ధమయ్యారు.జగనన్న పాలనలో సాధించిన విజయాలు.. ప్రజలకు దక్కిన సంక్షేమం, వారికి లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలా కృషి చేయాలనే అంశాలపై ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.టీడీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడoతో పాటు ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం చర్చించనున్నారు.ఈ మేరకు భీమిలిలో సీఎం జగన్ సమావేశం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news