పోలవరం చేరుకున్న సీఎం జగన్

అమరావతి : తాడేపల్లి నివాసం నుంచి పోలవరానికి ఏపీ సీఎం జగన్ కాసేపటి క్రితమే పోలవరం ప్రాజెక్టు వద్దుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు సీఎం జగన్. ఆ తర్వాత… స్పిల్ వే దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు సీఎం జగన్. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని మ్యాప్ ల ఆధారంగా సీఎంకు వివరిస్తున్నారు అధికారులు.

సీఎం జగన్‌ తో పాటు మంత్రులు అనిల్‌, పేర్ని నాని, ఆళ్ళనాని, శ్రీరంగనాథ రాజు, వనిత, కన్నబాబు, చెల్లుబోయిన, ఎంపీలు‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా…పోలవరం స్పిల్ వే పనులు 95% పూర్తి అయ్యాయని ప్రాజెక్టు ఎస్ఈ నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యాంలో గ్యాప్స్ ను పూరించటం పూర్తి అయ్యిందని.. దీని వల్ల వరద నీటిని కిందకు విడుదల చేయటం సాధ్యం అవుతుందని వెల్లడించారు. సుమారుగా ఆగష్టు 15 నాటికి ఎగువ కాఫర్ డ్యాం పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని… దిగువ కాఫర్ డ్యాం పనులు సెప్టెంబర్ నాటికి పూర్తి అవుతాయని తెలిపారు.